గడ్డి వాము దగ్ధం చేసిన వ్యక్తిపై కేసు నమోదు.

గడ్డి వాము దగ్ధం చేసిన వ్యక్తిపై కేసు నమోదు.

వేలేరు, జూలై 22 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రానికి చెందిన సూత్రపు సంపత్, తిరుపతిలు తమ వ్యవసాయ బావి వద్ద పాడి పశువుల కోసం నిల్వ ఉంచిన సుమారు 500 గడ్డి కట్టలు అగ్నికి ఆహుతయ్యాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు, అదే గ్రామానికి చెందిన బంక శ్రీనివాస్ పాత కక్షల నేపథ్యంలో గడ్డి వాముకు నిప్పంటించినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు వేలేరు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News