భువనగిరి మహాసభను విజయవంతం చేయాలి.
బానోత్ సునీల్ నాయక్.
హైదరాబాద్, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నారగని ప్రీతంను తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైశయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బెట రమేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ సునీల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూలై 24న భువనగిరిలోని ఎస్‌వీ ఆడిటోరియంలో నిర్వహించనున్న తెలంగాణ భూరక్షణ సమితి తొలి మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బానోత్ సునీల్ నాయక్ మాట్లాడుతూ, భువనగిరిలో జరిగే తొలి మహాసభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం మరోసారి పరిశీలించి, భూములు కోల్పోయిన అర్హులకు తిరిగి అప్పగించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
జూలై 24న జరిగే సభకు ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నారగని ప్రీతం హాజరుకానున్నారని తెలిపారు. భూములు కోల్పోయిన బాధితులంతా పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంపత్, రవి, వెంకటేష్, భువనగిరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.


Comments