కల్తీ ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు.

పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి.

కల్తీ ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు.

పెద్దమందడి,జూలై22(తెలంగాణ ముచ్చట్లు):

రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, కల్తీ డీఏపీ, ఆర్గానిక్ డీఏపీ పేరుతో నకిలీ ఎరువులు, ఇంపోర్టెడ్ డీఏపీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి, వ్యవసాయ అధికారులు హెచ్చరించారు.బుధవారం పెద్దమందడి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో అధికారులు పలు కీలక సూచనలు చేశారు. ఎరువుల విక్రయాలు పూర్తిగా ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సీఓ) నిబంధనల మేరకు నిర్వహించాలని, ప్రతి డీలర్ స్టాక్ బుక్స్‌ను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించరాదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రైతులకు ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా కంది, మినుము, రాగులు, కూరగాయలు, వేరుశనగ, ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సిఫారసు చేయాలని డీలర్లకు సూచించారు.సమావేశంలో వనపర్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ప్రభాకర్ రెడ్డి, పెద్దమందడి ఎస్‌ఐ జలంధర్ రెడ్డి పాల్గొని డీలర్లకు పలు సూచనలు, సలహాలు అందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఎరువుల విక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News