ఎల్‌నీనో కంటింజెన్సీ ప్లాన్ బుక్‌లెట్ ఆవిష్కరణ.

రైతులకు సబ్సిడీపై కంది, పెసర విత్తనాల పంపిణీ.

ఎల్‌నీనో కంటింజెన్సీ ప్లాన్ బుక్‌లెట్ ఆవిష్కరణ.

హనుమకొండ, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు): 

2026 వానాకాల పంటల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ రూపొందించిన ‘ఎల్‌నీనో కంటింజెన్సీ ప్లాన్–2026’ బుక్‌లెట్‌తో పాటు పంటల క్యాలెండర్లను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ఆవిష్కరించారు.అనంతరం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించేందుకు సబ్సిడీపై అందుబాటులోకి తీసుకువచ్చిన కంది, పెసర విత్తనాల ప్యాకెట్లను హసన్‌పర్తి, ఎల్కతుర్తి, దామెర, భీమదేవరపల్లి మండలాలకు చెందిన రైతులకు మంత్రుల చేతుల మీదుగా వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేశారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని, వ్యవసాయ శాఖ సూచనలను రైతులు పాటించాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు.IMG-20260721-WA0048

Tags:

Post Your Comments

Comments

Latest News