ఏకలవ్య పాఠశాలలో నులిపురుగు నివారణ కార్యక్రమం.

ఏకలవ్య పాఠశాలలో నులిపురుగు నివారణ కార్యక్రమం.

- కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి.
- విద్యార్థులకు నివారణ మాత్రల పంపిణీ.

అశ్వారావుపేట, జూలై 13 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం నులిపురుగు నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి ప్రారంభించి విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, బలహీనత, పోషకాహార లోపం ఏర్పడి చదువుపై ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా నులిపురుగు నివారణ మాత్రలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా నులిపురుగుల బారిన పడకుండా ఉండవచ్చని, పిల్లల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల సిక్‌రూమ్‌లో జ్వరంతో ఉన్న విద్యార్థులను పరామర్శించి, బలహీనంగా ఉన్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని తరగతుల విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ IMG-20260713-WA0031చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌వో పూజ ప్రసన్న, ఏఎన్‌ఎం అనిత, ఆశా కార్యకర్తలు బచ్చల పద్మ, కణితి జయ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్". 27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...
15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.
ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.