హుజురాబాద్‌లో ఎస్ ఐ ఆర్ సర్వేపై అవగాహన.
బోర్నపల్లి వార్డులో ఇంటింటికీ ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు.
హుజురాబాద్, జూలై 13(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వార్డులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్ ) ఓటరు జాబితా సర్వేపై బీజేపీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి సర్వే ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వేలో ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా పాల్గొని, అధికారులు కోరిన వివరాలు, అవసరమైన పత్రాలను అందించాలని కోరారు. ఓటరు జాబితాలో పేరు సక్రమంగా నమోదై ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొని సర్వే విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.


Comments