చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం.

ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు.

చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం.

హుజురాబాద్, జూలై 13(తెలంగాణ ముచ్చట్లు ):

చిన్నారులను నలిపురుగుల బారిన పడకుండా కాపాడి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో సోమవారం జాతీయ నలిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు హాజరై 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఒక చిన్న మాత్ర... పిల్లల ఆరోగ్యానికి గొప్ప రక్షణ. నలిపురుగుల నివారణ మాత్ర ప్రతి చిన్నారి హక్కు – ప్రతి తల్లిదండ్రుల బాధ్యత" అని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన చిన్నారికి ఆల్బెండజోల్ మాత్ర వేయించడం ద్వారా నలిపురుగుల వల్ల కలిగే రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఈ మాత్రలను ఉచితంగా అందజేస్తోందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీటీసీవో హిమబిందు, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల, సీడీపీవో సుగుణ, మున్సిపల్ కౌన్సిలర్లు సునీత, శ్రీలేఖ, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.IMG-20260713-WA0016

Tags:

Post Your Comments

Comments

Latest News

27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్". 27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...
15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.
ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.