జమ్మికుంట సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి.
జమ్మికుంట టౌన్ జూలై 13 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో సోమవారం ఉదయం బిసుగిరిషరీఫ్–జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య దిగువ లైన్లో వెళ్లిన ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు.
మృతుడి వయస్సు సుమారు 60–65 సంవత్సరాలు. ఆయన లేత పింక్ రంగు టీ-షర్ట్, నలుపు రంగు నెక్కర్ (తెలుపు గీతల డిజైన్‌తో) ధరించి ఉన్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర వివరాలు తెలిపే వస్తువులు లభించలేదు.
మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి, రామగుండం విచారణ చేపట్టారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా ఆయనను గుర్తించగలిగిన వారు 9949304574 లేదా 8712658604 నంబర్లకు సమాచారం అందించాలని ప్రభుత్వ రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.


Comments