పోలీస్ అధికారులకు ప్రతిభ పురష్కారాలు..
పతకాలు సాధించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్.
Views: 9
On
ఖమ్మం బ్యూరో, జులై 22(తెలంగాణ ముచ్చట్లు )
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. పతకాలు పొందిన వారిలో వైరా ఏసిపి సారంగపాణి, ట్రాఫిక్ ఎస్సై మౌలానా, ఎస్సై అమీర్ ఖాన్, తో పాటు పోలీస్ సిబ్బంది వున్నారు. ఉత్తమ సేవ పతకం (03) సేవ పతకం (07) ఉత్కృష్ట పతకాలు (03) సాధించారు.
ఈ నేపథ్యంలో బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా 13 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసి అభినందించారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సీపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఆర్ ఐ కామరాజు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Jul 2026 22:00:31
హుజురాబాద్, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను...


Comments