చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టుకు శ్రీకారం.

చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టుకు శ్రీకారం.

పెద్దమందడి,జూలై21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని శ్రీశ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జమ్మి చెట్టుకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్, దేవాదాయ కమిటీ అధ్యక్షుడు పోతుల రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామస్తులు జమ్మి పూజ నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పూజారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జమ్మి మొక్కను నాటారు. ఈ కార్యక్రమం గ్రామ సంప్రదాయాలను పరిరక్షించే దిశగా ఉపయోగపడుతుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్, దేవాదాయ కమిటీ అధ్యక్షుడు పోతుల రాంరెడ్డి, గ్రామ పెద్దలు ఎస్. రాములు, గొంది రామకృష్ణారెడ్డి, ఎం. బుచ్చన్న, వడ్డె చంద్రయ్య, పోతుల ప్రతాప్, బోయిన్ కృష్ణయ్య, జి. బాలరాజు, గుర్రంగడ్డ చల్మారెడ్డి, మందడి బందన్న, రాములు యాదవ్, పోతుల ప్రవీణ్‌కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News