ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.
ధర్మసాగర్‌లో బీఎల్‌వోల అత్యవసర సమావేశం.
Views: 0
On
ధర్మసాగర్, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా ఆధ్వర్యంలో బీఎల్‌వోల అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియలో తక్కువ శాతం నమోదు చేసిన బీఎల్‌వోలు ప్రత్యేక దృష్టి సారించి శాతం పెంచాలని సూచించారు. ప్రతి ఓటు అమూల్యమైనదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్ధార్ మాట్లాడుతూ, మిగిలిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పూర్తి చేయాలనే విషయంపై బీఎల్‌వోలకు సూచనలు, సలహాలు అందించారు. మరో రెండు రోజుల్లోగా నమోదు ప్రక్రియను 95 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఎపంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ అధికారి, ఇతర అధికారులు, వార్డు సభ్యులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Jul 2026 22:00:31
హుజురాబాద్, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను...


Comments