రాహుల్ గాంధీ ఘటనపై జమ్మికుంటలో కాంగ్రెస్ ఆగ్రహ జ్వాలలు.
జమ్మికుంట టౌన్ జూలై 22 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేయడం, ప్రశ్నించే స్వరాలపై దాడులు చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ప్రజాస్వామ్యంలో సహజమైనవేనని, అయితే వాటికి హింస, బెదిరింపులు, దాడులు సమాధానం కాదని అన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో చట్ట పరిపాలన అందరికీ సమానంగా ఉండాలని, ప్రతిపక్ష నాయకుల భద్రతను కూడా ప్రభుత్వం నిర్ధారించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్న చర్యలకు వ్యతిరేకంగానే ఈ నిరసన చేపట్టామని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మోలుగురి సదయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, శ్రీపతి స్వర్ణలత, నరేష్, పాతకాల మౌనిక, అనిల్, చందరాజు, ఎగిత సుజాత, అశోక్, మాచర్ల రాజు, యట్ల సునీత, కుతాడి
తిరుపతి, ముద్దామల్ల రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వర్ రావు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దొడ్డె శ్రీకాంత్, సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి, లింగరావు, పూదరి శివకుమార్ గౌడ్, సలీం, మండ అశోక్, ఆడెపు కిరణ్, దొగ్గల భాస్కర్, శ్రీనివాస్, పాత ప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శులు కుమ్మరి శ్యామ్, సజ్జాద్ మొహమ్మద్, సన్నీ, రాజ్‌కుమార్, జఫ్ఫానియా, గుర్రం ప్రవీణ్, చెంచాల శ్రీనివాస్, ఎగ్గని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments