కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత పోటీ పరీక్షల యాప్.

నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి

వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో “గిఫ్ట్ ఏ స్మైల్”

నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి

చిల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి మాలోతు రమేష్ నాయక్

హనుమకొండ, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):

భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జూలై 22న హనుమకొండలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చిల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి మాలోతు రమేష్ నాయక్ తెలిపారు.వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉచిత మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.హనుమకొండలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో జూలై 22న నిర్వహించే ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలోతు రమేష్ నాయక్ విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News