తాటిపాముల గ్రామ బీఎల్‌వోలకు ఘన సన్మానం.
శ్రీరంగాపూర్,జూలై24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్‌వోలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు సంగీత, భారతి, చెన్నమ్మలను సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ గ్రామ పెద్దలతో కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ఓటర్ల సవరణ కార్యక్రమంలో అంకితభావంతో పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను నమోదు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలులో అంగన్‌వాడీ టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అలాగే వారి సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుమ్మరి ఆంజనేయులు, హేమసుందర్ రెడ్డి, బోయ శ్రీను, బొంబాయి రామన్న, బోయ కురుమన్న, వడ్డె యెంకన్న, హనుమంతు రెడ్డి, చంద్రయ్య, హరికృష్ణ, చక్రవర్తి, గంధం విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Comments