ఎల్‌నినో ప్రభావం.. రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు.

ఎల్‌నినో ప్రభావం.. రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు.

పెద్దమందడి,జులై24తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలు, నీటి వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు, శాస్త్రీయ సాగు విధానాలపై రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచనలను పాటించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, సర్పంచ్,ఏఈఓ తో పాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News