నీట్ పేపర్ లీక్‌పై ధర్మసాగర్‌లో కాంగ్రెస్ నాయకుల నిరసన.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.
ధర్మసాగర్,జులై23(తెలంగాణ ముచ్చట్లు):
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్మసాగర్ సర్కిల్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెసరు రమేష్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం కాకుండా వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, వారి భవిష్యత్తు పరిరక్షణ కోసం గ్రామ గ్రామాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
.


Comments