కొత్తకోటలో 233వ బూత్‌కు వంద శాతం మార్కు.
బీఎల్‌ఓ విక్టోరియా సంపత్‌కు సన్మానం.
కొత్తకోట,జూలై23(తెలంగాణ ముచ్చట్లు):
కొత్తకోట మున్సిపల్ పరిధిలోని 233వ పోలింగ్ బూత్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో గణన పత్రాల పూరింపును వంద శాతం పూర్తి చేసినట్లు బీజేపీ ఉపాధ్యక్షుడు, బీఎల్‌ఏ-2 (233వ బూత్) కొమ్ము భరత్ భూషణ్ తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు బూత్ పరిధిలోని ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలను నమోదు చేయడంతో పాటు మరణించిన వారు, వలస వెళ్లిన వారు, డబుల్ ఓట్లు ఉన్న వారి వివరాలను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సమర్థవంతంగా విధులు నిర్వహించి గణన పత్రాల పూరింపును విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్‌ఓ విక్టోరియా సంపత్‌ను స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.233వ బూత్‌లో మొత్తం 735 మంది ఓటర్లు ఉండగా, వారిలో 635 మంది వివరాలు సక్రమంగా నమోదు చేశారు. పరిశీలనలో 25 మంది మరణించినట్లు, 75 మంది వలస వెళ్లినట్లు లేదా డబుల్ ఓట్లు ఉన్నట్లు గుర్తించి మొత్తం 100 ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. దీంతో బూత్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజ్, కొమ్ము అనిల్, జయరాజ్, భాగ్యమ్మ, సంతోషమ్మ, ఆటో యేసు, చెన్నయ్య, జఖీ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.


Comments