ఇందిరమ్మ కాలనీలో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు..

ఇందిరమ్మ కాలనీలో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు..

విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించిన..

 వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్..

ఖమ్మం బ్యూరో,జూలై 16(తెలంగాణ ముచ్చట్లు )

వైరా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరమ్మ కాలనీలో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్  బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కాలనీలో విస్తృతంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంటి పై నుంచి ప్రమాదకరంగా వెళ్తున్న విద్యుత్ వైర్ల తొలగింపు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. కాలనీలో ఎన్ని కొత్త స్తంభాలు అవసరమవుతాయో, ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే విషయాలపై అధికారులు అంచనా (ఎస్టిమేట్) సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా కట్ల సంతోష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కాలనీలో ప్రతి గల్లీకి విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.
ఈ పరిశీలనలో విద్యుత్ శాఖ డీఈ రమేష్, ఏడీఈ కిరణ్, సబ్ ఇంజనీర్ నరేష్, లైన్ ఇన్‌స్పెక్టర్ జార్జ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.