దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.

దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.

- హైకోర్టు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ వినతి.
- మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది నియామకానికీ విజ్ఞప్తి.

దమ్మపేట, జూలై 17 (తెలంగాణ ముచ్చట్లు): 

దమ్మపేటలో నూతన సబ్‌కోర్టు ఏర్పాటు చేసి, కోర్టులో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చాలని దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను కోరారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్‌ఫోలియో న్యాయమూర్తులు జస్టిస్ జె. శ్రీనివాసరావు, జస్టిస్ కె. శరత్‌లను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దమ్మపేట కోర్టులో ఎదురవుతున్న సమస్యలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న కేసుల భారం, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దమ్మపేటలో ప్రత్యేక సబ్‌కోర్టు మంజూరు చేయాలని కోరారు. కోర్టు భవనంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోర్టు ఆవరణలో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధుల వినతిపై జస్టిస్ జె. శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన వారిలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్రబాబు, హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్, ట్రెజరర్ తామ బాలరాజు, గేమ్స్ సెక్రటరీ తీర్నతి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.