ఇంటి సరిహద్దు వివాదం ముగ్గురు అరెస్ట్.

ఇంటి సరిహద్దు వివాదం ముగ్గురు అరెస్ట్.

వీణవంక, ఆగస్టు 04 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో ఇంటి సరిహద్దు, దారి వివాదం నేపథ్యంలో మహిళపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితులైన కర్ర రాంగోపాల్ రెడ్డి, కర్ర గణపతి రెడ్డి, కర్ర ప్రవీణ్ రెడ్డిని వీణవంక పోలీసులు అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోర్కల్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి ముగ్గురినీ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు వీణవంక ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. గ్రామంలో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శిశు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం. శిశు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం.
పెద్దమందడి,ఆగస్టు04(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మంగంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను అంగన్‌వాడీ టీచర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రమేష్ హాజరయ్యారు....
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. బీఆర్‌ఎస్ గూటికి ముగ్గురు సర్పంచ్‌లు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాటలో సీపీఐ
ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సీపీఎం ఆందోళన.
ఇంటి సరిహద్దు వివాదం ముగ్గురు అరెస్ట్.
పరిమళ కాలనీ వాసులకు ఉచిత వైద్య సేవలు.