ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.

వనపర్తి డీఆర్‌డీఓకు వినతి.

ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.

వనపర్తి,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లాలో వి.బి.జి. ర్యామ్.జి.లో ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేశారు.ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లందరూ తమ విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం లేదని, ఆయా కార్యక్రమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.మండల లాగిన్‌ల విషయంలో సీఓలు పాస్‌వర్డ్‌లను మార్చడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనులకు సంబంధించిన విధులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం గ్రామాల్లో వనమహోత్సవంలో భాగంగా ఫిట్టింగ్, ప్లాంటింగ్, ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఫార్మ్ పాండ్స్‌కు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉందన్నారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాల్లోని కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి మండల లాగిన్ సౌకర్యం కల్పించాలని డీఆర్‌డీఓను కోరారు. లాగిన్ సదుపాయాన్ని పునరుద్ధరించి, కూలీలకు పనులు కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమం వనపర్తి జిల్లా కమిటీ అధ్యక్షుడు పానుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, జనరల్ సెక్రటరీ అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యుడు మోచర్ల నరసింహతోపాటు ఇతర కమిటీ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. *అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):...
అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.
వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.
దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.
సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.
వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.