నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
ఖమ్మం బ్యూరో, జులై 29(తెలంగాణ ముచ్చట్లు )
జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం పర్యటన లో భాగంగా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఉన్న నామ ముత్తయ్య–వరమ్మ స్మృతివనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తల్లిదండ్రులు నామ ముత్తయ్య, వరమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించి, నామ ముత్తయ్య–వరమ్మ జీవిత విశేషాలు, సమాజానికి అందించిన సేవల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. అక్కడ ప్రదర్శించిన అరుదైన చిత్రాలను పరిశీలించారు. ఆ గ్యాలరీ ఫోటోల విశేషాలను నామ సోదరుడు సీతయ్య వివరించారు. స్మృతివనంలో ఏర్పాటు చేసిన మొక్కలను, పరిసరాలను పరిశీలించి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు.


Comments