ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ముప్పూరి గణేష్ కుమార్.
వనపర్తి,జూలై25(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కమిటీలో వనపర్తి జిల్లాకు చెందిన ముప్పూరి గణేష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ..నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉపసర్పంచ్‌లు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, వారికి ప్రభుత్వం గౌరవ వేతనం కల్పించకపోవడం విచారకరమని అన్నారు.రాష్ట్రంలోని ఉపసర్పంచ్‌లకు నెలకు రూ.5,000/- వేల రూపాయల గౌరవ వేతనం మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు కూడా నెలకు రూ.3,000/- వేల రూపాయల గౌరవ వేతనం అందించాలని కోరారు. గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలంటే ప్రజాప్రతినిధుల సేవలకు తగిన గుర్తింపు, ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ముప్పూరి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఉపసర్పంచ్‌కు న్యాయం జరిగేలా ఫోరం తరఫున నిరంతరం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని ఆయన అన్నారు.


Comments