పెద్దమందడి రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభం.
Views: 0
On
పెద్దమందడి,జూలై27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల రైతులకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందుబాటులోకి తీసుకురావడానికి పెద్దమందడి రైతు వేదికలో సోమవారం (జూలై 27) నుంచి బుధవారం (జూలై 29) వరకు మూడు రోజుల పాటు విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ తెలిపారు.ఈ విత్తన మేళాలో కందులు, జొన్నలు, మినుముల విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను పొందాలని సూచించారు.మండలంలోని రైతులందరూ నిర్ణీత తేదీల్లో పెద్దమందడి రైతు వేదికను సందర్శించి సబ్సిడీ విత్తనాలను పొందాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Jul 2026 21:44:48
హుజురాబాద్,జులై 27(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆధునిక...


Comments