పెద్దమందడి మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

పెద్దమందడి మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

పెద్దమందడి,జూలై26(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం పిలుపు మేరకు ఆదివారం వనపర్తి జిల్లా పెద్దమందడిలో నిర్వహించిన సమావేశంలో మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎస్. రాఘవేందర్, అధ్యక్షుడిగా బొడ్డుపల్లి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కె. శేఖర్, కోశాధికారిగా కె. శేఖర్ ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమ్మరి గంగమ్మ మాట్లాడుతూ.. కుమ్మర సంఘాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసేందుకు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి నరసింహ మాట్లాడుతూ.. మట్టి కుండల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సంఘ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు బొడ్డుపల్లి మన్నెంకొండ, శివ, గుణగంటి నరేందర్, లక్ష్మీనారాయణ, రవి, రామకృష్ణ, శ్రీరాజు, పవన్, ఎస్. భీమన్న, జయరాములు, కొండన్న, రాములు, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడి మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. పెద్దమందడి మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
పెద్దమందడి,జూలై26(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం పిలుపు మేరకు ఆదివారం వనపర్తి జిల్లా పెద్దమందడిలో నిర్వహించిన సమావేశంలో మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని...
మాతృత్వాన్ని కవిత్వంగా మలిచిన కవికి ఘన సన్మానం .
సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.
నీట్ బాధితులకు కొవ్వొత్తుల నివాళి.
సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .
శివారాధనతో పుణ్యమయమైన తొలి ఏకాదశి .
ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి