మాతృత్వాన్ని కవిత్వంగా మలిచిన కవికి ఘన సన్మానం .

మాతృత్వాన్ని కవిత్వంగా మలిచిన కవికి ఘన సన్మానం .

వనపర్తి,జూలై26(తెలంగాణ ముచ్చట్లు):

మాతృమూర్తుల త్యాగం, ప్రేమ, గొప్పతనాన్ని హృద్యమైన కవిత్వంగా ఆవిష్కరించిన ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్యకు సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఆదివారం నాగర్‌కర్నూల్‌లో ఘనంగా సన్మానం నిర్వహించారు. తమ పిల్లలను ఉత్తమ కవులు, రచయితలుగా తీర్చిదిద్దిన పన్నెండుమంది తల్లుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన 'పసరంటిన కొడవలి' కవితా సంపుటిని ఈ సందర్భంగా కొనియాడారు.సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. అమ్మ లేని జీవితం ఊహించలేమని, కుటుంబం కోసం తన జీవితాన్నంతా త్యాగం చేసే మహోన్నత వ్యక్తి తల్లేనని అన్నారు. పసరంటిన కొడవలి లోని ప్రతి కవిత పాఠకులకు తమ తల్లి ప్రేమ త్యాగాలను గుర్తు చేస్తుందని, ఇటువంటి విలువైన రచనలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, డా. బి. శ్యాంసుందర్, తులసి కుమార్, దేవరాజ్ తదితరులు పాల్గొని వనపట్ల సుబ్బయ్యను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడి మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. పెద్దమందడి మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
పెద్దమందడి,జూలై26(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం పిలుపు మేరకు ఆదివారం వనపర్తి జిల్లా పెద్దమందడిలో నిర్వహించిన సమావేశంలో మండల కుమ్మర యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని...
మాతృత్వాన్ని కవిత్వంగా మలిచిన కవికి ఘన సన్మానం .
సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.
నీట్ బాధితులకు కొవ్వొత్తుల నివాళి.
సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .
శివారాధనతో పుణ్యమయమైన తొలి ఏకాదశి .
ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి