అర్చక కుటుంబానికి ఆర్థిక చేయూత .
ఖమ్మం బ్యూరో, జులై 27(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్దిపాలెం గ్రామం లోని ఎస్ టి కె వెంకటేశ్వర్లు భార్య ఐదు రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చిది అట్టి నవ జాత శిశువును అత్యవసర చికిత్స నిమిత్త మై విజయవాడ లోని అనువై బేబీ కేర్ సెంటర్ నందు చేర్పించడం జరిగినది వైద్యానికి అవసరం అయ్యో ధన సహాయం కొరకు మండల డి డి యన్ అధ్యక్షుడు ఆయన కొత్తూరు రాజేష్ శర్మ ను అలాగే అర్చకులు కాశవజ్జల నరసింహమూర్తి ని అభ్యర్ధించగా వారు జిల్లా సంఘానికి సమాచారం చేరావేశారు జిల్లా సంఘం అభ్యర్డనను మన్నించి జిల్లాలోని అర్చకులు అందరి ద్వారా 81వేల రూపాయలు సేకరించి అర్చకునికి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా డి డి యన్ అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ కార్యదర్శి మరింగంటి భార్గవా చార్యులు రాష్ట్ర డి డి యన్ అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నావజ్జల ప్రసాద్ శర్మ నేలకొండపల్లి మండల అధ్యక్షులు చిలుకూరు నాగమూర్తి అర్చకులు కె చంద్రశేఖర శర్మ పాల్గొన్నారు ఈ సందర్బంలో ఎస్ టి కె వెంకటేశ్వర్లు అత్యవసర సమయంలో నా కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక సహాయం అందించిన జిల్లా దూప దీప నైవేద్య అర్చక సంఘానికి జిల్లాలోని డి డి యన్ అర్చకులకు ఋణపడి ఉంటానని ప్రకటిస్తూ అందరికి ధన్యవాదములు తెలియజేశారు.


Comments