కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం.
దారి లేకున్నా.. ప్రాణం కోసం పరుగెత్తిన 108.
సత్తుపల్లి, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన పొట్లూరు వేణు (25) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే బాధితుడి ఇంటికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురైనా, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, పైలట్ కట్టం మహేష్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బాధితుడి వద్దకు చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతడిని అంబులెన్స్‌లోకి తరలించి, మార్గమధ్యంలోనే అత్యవసర వైద్య సేవలు కొనసాగిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి చేర్చారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన 108 సిబ్బంది సేవలను ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, ఖమ్మం జిల్లా 108 మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్ అభినందించారు.


Comments