మీసేవ కేంద్రాల్లో పేపర్‌లెస్ సేవలు అమలు చేయాలి.

పెద్దమందడి తహసిల్దార్ మల్లికార్జున్.

మీసేవ కేంద్రాల్లో పేపర్‌లెస్ సేవలు అమలు చేయాలి.

పెద్దమందడి,జూలై20(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మీసేవ కేంద్రాల్లో పేపర్‌లెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని తహసిల్దార్ మల్లికార్జున్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్  కార్యాలయంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా కుల, ఆదాయ, నివాస, ఓబీసీ, ఈబీసీ తదితర ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అధికారుల సంతకాల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుందని తెలిపారు.దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డు వంటి అవసరమైన పత్రాలను తప్పనిసరిగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని మీసేవ నిర్వాహకులకు సూచించారు. తప్పుడు పత్రాలను సమర్పించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పేపర్‌లెస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు శివకుమార్ చారి, ఈశ్వర్, మహేష్, వెంకటేష్, కార్తీక్, రాజశేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు. సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు.
జమ్మికుంట టౌన్ జులై 20 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు....
ఆర్య వైశ్య సంఘం నూతన నాయకులకు బీఎస్పీ నేతల ఘన సన్మానం.
సోయం రాజాబాబుకు తుది వీడ్కోలు.. నివాళులతో పోటెత్తిన రాజకీయ నేతలు.
కోరపల్లి పురాతన శివాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. దరఖాస్తులకు దేవాదాయ శాఖ ఆహ్వానం.
సంఘ ఐక్యతే లక్ష్యం.. జూలై 27న పెయింటర్స్ వర్క్ బంద్.
పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ కుటుంబానికి పరామర్శ...
ఉత్తమ సేవలకు గుర్తింపు.. పోలీసు మిత్రులకు ఘన సన్మానం.