ఆర్య వైశ్య సంఘం నూతన నాయకులకు బీఎస్పీ నేతల ఘన సన్మానం.
జమ్మికుంట టౌన్ జూలై 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర కమిటీలో బాధ్యతలు చేపట్టిన నాయకులను, అలాగే నూతనంగా ఎన్నికైన జమ్మికుంట పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు సోమవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
జమ్మికుంటకు చెందిన పవన్ మోటార్స్ షోరూమ్ అధినేత ఏ. రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ వింగ్ ఉపాధ్యక్షుడిగా, చందా రాజు రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా బీఎస్పీ నాయకులు వారిని శాలువాలతో సత్కరించారు. అలాగే జమ్మికుంట పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన లెంకలపల్లి శరత్ కుమార్ను కూడా ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బీఎస్పీ హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ, రాజేంద్ర ప్రసాద్, చందా రాజు ఇద్దరూ మూడు దశాబ్దాలుగా పాత్రికేయులుగా ప్రజా సమస్యలపై కలం పట్టి విశేష సేవలు అందించారని కొనియాడారు. అదే సేవా స్ఫూర్తితో ఆర్య వైశ్య సంఘాల అభివృద్ధికి, సమాజ సేవకు అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పద్మ శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు మారపల్లి మొగులయ్య, గరిగే చంద్రయ్య, మామిండ్ల మల్లయ్య, బీఎస్పీ సోషల్ మీడియా హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి మంద జగన్ తదితరులు పాల్గొన్నారు.


Comments