సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు.

సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు.

జమ్మికుంట టౌన్ జులై 20 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బస్వారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో సీఎంఆర్ ధాన్యం నిల్వలు, సంబంధిత రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
పౌరసరఫరాల శాఖ నుంచి మిల్లుకు వివిధ సంవత్సరాల్లో కేటాయించిన ధాన్యం పరిమాణం, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించిన బియ్యం వివరాలను అధికారులు రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వల్లో తేడాలు గుర్తించినట్లు సమాచారం. సంబంధిత అంశాలపై అధికారులు లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిసింది.
ఈ తనిఖీల్లో కరీంనగర్ విజిలెన్స్ డీఎస్పీ సీతారెడ్డి, సీఐలు అనిల్, ప్రశాంత్‌రావు, రవీందర్, తహసీల్దార్ దినేష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు. సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు.
జమ్మికుంట టౌన్ జులై 20 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు....
ఆర్య వైశ్య సంఘం నూతన నాయకులకు బీఎస్పీ నేతల ఘన సన్మానం.
సోయం రాజాబాబుకు తుది వీడ్కోలు.. నివాళులతో పోటెత్తిన రాజకీయ నేతలు.
కోరపల్లి పురాతన శివాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. దరఖాస్తులకు దేవాదాయ శాఖ ఆహ్వానం.
సంఘ ఐక్యతే లక్ష్యం.. జూలై 27న పెయింటర్స్ వర్క్ బంద్.
పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ కుటుంబానికి పరామర్శ...
ఉత్తమ సేవలకు గుర్తింపు.. పోలీసు మిత్రులకు ఘన సన్మానం.