గంజాయి మత్తుకు బానిసైన వ్యక్తులను పునరావాస కేంద్రంలో చేర్పింపు.
వేలేరు, జులై 20 (తెలంగాణ ముచ్చట్లు):
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించిన అధికారులు, గంజాయి సేవించే అలవాటు ఉన్న వ్యక్తులను గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సమ్మతితో డీ-అడిక్షన్ (పునరావాస) కేంద్రంలో చేర్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు బానిసైన వారిని శిక్షించడం కంటే వారికి వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్, పునరావాసం అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పునరావాస సేవలను విస్తరిస్తోందని పేర్కొన్నారు.
ప్రజలు తమ కుటుంబ సభ్యులు లేదా పరిసరాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసై ఉంటే, దాచిపెట్టకుండా సంబంధిత పోలీసు శాఖ లేదా డీ-అడిక్షన్ కేంద్రాలకు సమాచారం అందించి, పునరావాస సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


Comments