హరితహారంతో పచ్చదనానికి శ్రీకారం.
కోతులనడుమ గ్రామంలో మొక్కల పంపిణీ.
ఎల్కతుర్తి, జూలై 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి, గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, వార్డు సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. హరితహారాన్ని ప్రజల ఉద్యమంగా విజయవంతం చేయాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పచ్చదనం ప్రాధాన్యాన్ని వివరించారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉప సర్పంచ్ దొండ్ర శీను, వార్డు సభ్యులు ఎర్రోళ్ల చైతన్య, మాట్ల కార్తీక్, ఎర్రోళ్ల హైమావతి, మాచర్ల పుష్ప, గ్రామ కార్యదర్శి హిమవంతు, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్, కారోబార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.


Comments