రేవల్లి మండల విద్యాధికారిగా వరప్రసాద్‌రావు నియామకం.
Views: 0
On
పెద్దమందడి,జూలై20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా రేవల్లి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మద్దిగట్ల–మోజర్లలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సూగూరు వరప్రసాద్‌రావును నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అనుమతితో ఈ నియామక ఉత్తర్వులు సోమవారం విడుదలయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మద్దిగట్ల–మోజర్లలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సేవలందించిన వరప్రసాద్‌రావు ఇకపై రేవల్లి మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సహచరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Jul 2026 22:29:47
జమ్మికుంట టౌన్ జులై 20 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు....


Comments