కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది.

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  ఏనుగుల రాకేష్ రెడ్డి.

కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది.

హన్మకొండ,జులై19(తెలంగాణ ముచ్చట్లు): 

ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు కలిగి ఉండాలని, కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు.
హన్మకొండ జూలైవాడలో బీఆర్ఎస్ యువ నాయకుడు అంకం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత లేబర్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణలో కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నమోదైన కార్మికులకు ప్రమాద బీమా, ప్రసూతి సహాయం, పిల్లల విద్యా సహాయం, వివాహ సహాయం, అంత్యక్రియల ఆర్థిక సహాయం తదితర పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారి శ్రమతోనే రాష్ట్ర నిర్మాణం సాధ్యమైందని అన్నారు. మొదటి విడతలో సుమారు 500 మంది కార్మికులకు లేబర్ కార్డులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అంకం లక్ష్మణ్ సేవాభావాన్ని అభినందించారు. ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న జూలైవాడ పెద్దలు, మేధావులు, యువత, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

“ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే స్ఫూర్తితో ప్రజాసేవ చేస్తున్న యువ నాయకులను బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, అంకం లక్ష్మణ్ వంటి సేవాభావం కలిగిన నాయకులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రామస్వామి, ఆరూరి విష్ణు, అయినవోలు సర్పంచ్ రఘువంశీ, గునిగంటి చందర్, కంది యాదగిరి, పురుషోత్తం యాదవ్, బలవంతుల అశోక్, మురళి, సంభరాజు, శివరాత్రి నాగరాజ్ తదితబిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  ఏనుగుల రాకేష్ రెడ్డిరులు పాల్గొన్నారు.IMG-20260719-WA0041IMG-20260719-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కాకతీయ వైభవం ప్రతిబింబించాలి. మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కాకతీయ వైభవం ప్రతిబింబించాలి.
హైదరాబాద్,జులై19(తెలంగాణ ముచ్చట్లు):  వరంగల్ చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హైదరాబాద్‌లో...
కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది.
చిన్నారెడ్డి నియామకం హర్షణీయం.
జిల్లా రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు సయ్యద్ పాషాను సన్మానించిన పలుస శంకర్ గౌడ్.
కూచిపూడి నృత్యంలో ప్రతిభ చాటుతున్న కుమారి శృతి.
చిలుకటోనిపల్లి ఊకచెట్టు వాగులో మొసలి పట్టివేత.
వడ్డెరల అభ్యున్నతికి నూతన నాయకత్వం.