గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
వనపర్తి,జూలై29(తెలంగాణ ముచ్చట్లు):
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల సర్వే ప్రక్రియను నియోజకవర్గంలో నూరు శాతం విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. నిర్ణీత గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పూర్తి చేయడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు.బుధవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మండల స్థాయి నాయకులు ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి, బీఎల్ఏ-2 ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పూర్తి ఉత్సాహంతో పనిచేసేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తే ప్రధాన బలమని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ కోసం అందరూ ఐక్యత, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన విజయాలను సాధించగలమని పేర్కొన్నారు.ప్రస్తుతం ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు సమయం చాలా తక్కువగా ఉన్నందున, అందుబాటులో ఉన్న గడువులోనే 100 శాతం నమోదు పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బీఎల్ఏ-2 ప్రతినిధులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపించాలని ఆదేశించారు.మండల నాయకులు ప్రత్యేక దృష్టి సారించి బీఎల్ఏ-2ల పనితీరును ప్రతిరోజూ సమీక్షించాలని, అవసరమైన చోట తగిన మార్గనిర్దేశం చేయాలని అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్‌లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జ్ శత్రురావు బుజ్జి, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, బీఎల్ఏ-2 ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments