వీణవంక జూనియర్ కళాశాలకు ఎం. కుమార్ సారథ్యం.
వీణవంక, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అదనపు బాధ్యతల ప్రిన్సిపల్‌గా జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం. కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం. కుమార్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పాఠ్యబోధన, పరీక్షల సన్నద్ధత, కెరీర్ మార్గదర్శకత్వంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు.


Comments