వ్యవసాయం–పశుపోషణపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి.
పెద్దమందడి,ఆగస్టు02(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యవసాయం, పశుపోషణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేగా సమర్థవంతమైన పాలన అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు వ్యవసాయ రంగం, పశుసంరక్షణకు కూడా సమయం కేటాయిస్తున్నారు.ఆదివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి అక్కడ చేపడుతున్న వివిధ వ్యవసాయ కార్యకలాపాలను పరిశీలించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు ఏర్పాటు చేయనున్న పొలాన్ని పరిశీలించారు. భూసార పరిస్థితులు, ఆయిల్‌పామ్ సాగుకు ఉన్న అనుకూలత, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు.అనంతరం తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవుల వద్దకు వెళ్లి స్వయంగా అరటిపండ్లు తినిపించారు. పశువుల ఆరోగ్య పరిస్థితి, వాటికి అందిస్తున్న పోషకాహారం, సంరక్షణ విధానాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పశువుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎమ్మెల్యే సూచించారు. సమయానికి మేత, పోషకాహారం, తాగునీరు అందేలా చూడడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న ప్రతి పనిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, పశువుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.


Comments