ఆర్టీఐ వ్యవస్థను బలోపేతం చేయాలి.

జిల్లా స్థాయిలో కమిటీ, ఆర్టీఐ సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి.

ఆర్టీఐ వ్యవస్థను బలోపేతం చేయాలి.

హుజురాబాద్ , ఆగస్టు 8 (తెలంగాణ ముచ్చట్లు ): 

సమాచార హక్కు చట్టం-2005ను జిల్లాస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమాచార హక్కు (ఆర్టీఐ) కమిటీని ఏర్పాటు చేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ IMG-20260808-WA0011చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ కన్వీనర్ బండ నరేందర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
జిల్లా స్థాయిలో ఆర్టీఐ మానిటరింగ్ మెంబర్స్ వ్యవస్థను పునరుద్ధరించాలని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఆర్టీఐ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. ప్రజలకు సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం సమాచార హక్కు చట్టం గురించి ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో చాలామంది తమ హక్కును సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారని బండ నరేందర్ తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆర్టీఐ చట్టం ఎంతో కీలకమన్నారు.
సమాచార హక్కు చట్టం సాధన కమిటీకి అధికారిక ప్రాతినిధ్యం కల్పించి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌కు సిఫారసు చేయాలని ఆయన కోరారు. కమిటీకి కమిషన్‌లో సభ్యత్వం కల్పిస్తే ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించి, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలను చైతన్యపరచగలమని తెలిపారు. తమ కమిటీకి ఈ అవకాశం తప్పనిసరిగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, తిరగమల్ల నాగార్జున, కుమారస్వామి, రాజు, ప్రసాద్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News