నీరు పేద వికలాంగుడి కుటుంబానికి అండగా నిలిచిన కొండల్ ముదిరాజ్ .
సమ్మయ్య దశదిన కార్యక్రమానికి సామగ్రి చేయూత.
జవహర్‌నగర్, ఆగస్టు 8( తెలంగాణ ముచ్చట్లు):
జవహర్‌నగర్ 10వ డివిజన్‌కు చెందిన పేద వికలాంగుడు సమ్మయ్య కుటుంబానికి పలువురు నాయకులు అండగా నిలిచారు. స్పైనల్ కార్డ్ ఇంజురీ, బ్రెయిన్ ట్యూమర్‌తో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య గతవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న దశదిన కార్యక్రమానికి అవసరమైన సామగ్రిని శనివారం అందజేశారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ పలువురు దృష్టికి తీసుకువచ్చి తన వంతు సహాయంగా ఈ కార్యక్రమానికి సహకరించాలి అని అనడంతో శివ కష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, వికలాంగుల సంఘాల ప్రతినిధులు తమ వంతు సహకారం ముందుకు వచ్చి అందించారు. జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తడి సాయి, వికారాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మాయ బ్రహ్మ నరసింహ, సీనియర్ నాయకులు నాగులు ముదిరాజ్, సీనియర్ వికలాంగుల నాయకులు టైగర్ నరసింహ, ఎంపీ.ఆర్.డి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి, ఎంపీ.ఆర్.డి సీనియర్ వికలాంగుల నాయకులు ధనరాజ్, రాజేందర్, నర్సింగరావు, అప్పారావు,రమేష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రంగుల సతీష్, సీనియర్ జర్నలిస్ట్ గంగాధర్ చారి, బలగం టీవీ సీఈవో చింతల విజయ్ కుమార్, జినుక రఘు, తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబానికి వంట సామాగ్రి అందించడం జరిగింది ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ సమ్మయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి దృష్టికి కుటుంబ పరిస్థితిని తీసుకెళ్లి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని, అలాగే సమ్మయ్య కుమార్తెల చదువుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతఅని మెరుగు శివకృష్ణ అన్నారు. 


Comments