మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శుక్రవారం పెద్దమందడి మండల పరిధిలోని వెల్టూర్, చిలకటోనుపల్లి, గట్లకానాపురం, స్కూల్ తండా, మంగంపల్లి గ్రామాల్లో ఆయన నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక మహిళలకు చీరలను అందజేశారు.ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవిత స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.ప్రధానంగా అమలు అవుతున్న పథకాలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఆదర్శ పాఠశాలలో మహిళా అధ్యక్షురాలు నియామకం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు కట్టించడం, ఆర్టీసీ బస్సుల కొనుగోలులో మహిళా సమాఖ్యల భాగస్వామ్యం, వడ్డీ రహిత రుణాలు, విద్యార్థుల వసతి మెస్ చార్జీల తగ్గింపు వంటి పథకాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబి, సామాజికంగా బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.అతను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలను ఆకర్షించాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్షాల మాయమాటలకు ఎవరూ మోసపోకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర స్థానిక అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారుIMG-20251121-WA0203

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్