మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి ..
విగ్రహానికి పూలమాల అర్పించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఏ ఎస్ రావు నగర్, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు)
మనిషి ఎదుగుదలకు, సమాజ పురోగతికి విద్యే ప్రధాన ఆధారం అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సైనిక్‌పురి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాల అర్పించారు.అణగారిన వర్గాల విద్యా అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన ఫూలే నిజమైన మానవతావాది అని ఎమ్మెల్యే అన్నారు. “చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు” అనే నిజాన్ని గ్రహించి, 19వ శతాబ్దంలోనే నిమ్న వర్గాలు, మహిళల కోసం దేశంలోనే తొలి పాఠశాలలను స్థాపించిన మహనీయుడు ఫూలే అని గుర్తుచేశారు.సామాజిక దురాచారాలు, మూడనమ్మకాలు, కుల వివక్ష వంటి అడ్డంకులను విద్య ద్వారానే అధిగమించవచ్చని ఫూలే చాటి చెప్పారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అణచివేతకు గురైన వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి, వారి హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో డా. ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మల్లేష్, వంశీ రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments