కేశవాపూర్ క్లస్టర్‌లో నామినేషన్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ సన్ ప్రీత్ సింగ్
ఎల్కతుర్తి. నవంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామపంచాయితీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్ క్లస్టర్‌ను సీపీ సన్ ప్రీత్ సింగ్ గురువారం సందర్శించారు. నామినేషన్ కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, భద్రతా పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు అందించారు.
సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ,
నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులు మరియు ప్రజలు ఎలాంటి ఒత్తిడి లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునే వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసు బందోబస్తును మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయం పాటించి, మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన హితవు పలికారు.
సీపీతో పాటు ఈ కార్యక్రమంలో డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, సీఐ పులి రమేష్, ఎల్కతుర్తి ఎస్‌హెచ్‌ఓ అక్కినపల్లి ప్రవీణ్ తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Comments