చీర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం 

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభం

చీర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం 

మేడ్చల్, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీర్యాల గ్రామంలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ పూజా కార్యక్రమం గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి, మాజీ ప్రజా ప్రతి నిధులు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి వజ్రేష్ యాదవ్ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను అధికారికంగా ప్రారంభించారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వజ్రేష్ యాదవ్ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం తమకు సొంతిల్లు కలగడానికి కారణమైందని పేర్కొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్‌లకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .