పదో తరగతిలో మండల టాపర్ దీప్తిని సన్మానించిన జిల్లా కలెక్టర్.

పదో తరగతిలో మండల టాపర్ దీప్తిని సన్మానించిన జిల్లా కలెక్టర్.

వనపర్తి,జూలై21(తెలంగాణ ముచ్చట్లు): 

పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు మాధ్యమ విభాగంలో పెద్దమందడి మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన మద్దిగట్ల–మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని  దీప్తిని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సన్మానించారు.వనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేసి ఆమెను అభినందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ప్రతి విద్యార్థి ఉన్నత విజయాలను అందుకోవచ్చని అన్నారు.దీప్తి సాధించిన మండల ప్రథమ స్థానం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు విద్యార్థినిని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, వార్డు సభ్యులు, విఐపీ సంస్థ భాగస్వామ్య సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.