భీమదేవరపల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా దొంగల రాణాప్రతాప్ నియామకం.
భీమదేవరపల్లి, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా దొంగల రాణాప్రతాప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తమ కుటుంబానికి భారతీయ జనతా పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని రాణాప్రతాప్ పేర్కొన్నారు. తన తాత దొంగల వెంకట్రాజం జనసంఘ్ కాలం నుంచే జాతీయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారని, అనంతరం తన తండ్రి దొంగల కొమురయ్య కూడా బీజేపీలో నిబద్ధతతో పనిచేస్తూ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు.
తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, సిద్ధిపేట్ జిల్లా అధ్యక్షులు, బైరీ శంకర్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం వెంకటేశం, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, గుర్రాల లక్ష్మారెడ్డి, పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, మాచర్ల కుమార్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ భీమదేవరపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని రాణాప్రతాప్ తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Comments