మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన హోసన్నా మహిళా సంఘం
Views: 40
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో హోసన్నా మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపింది. మహిళల హక్కులు, సమానత్వం, సామాజిక స్థాయిని పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏడాది నిర్వహించే ఈ దినోత్సవాన్ని సంఘ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యులు కేకు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. మహిళల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, సమాజంలో వారికి మరింత గుర్తింపు రావాల్సిన అవసరంపై చర్చించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు తమవంతు కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లెపాక శ్రీలేఖ, బొల్లెపాక అనిత, ఎర్ర లుధియా, పట్ల సువార్త, నల్ల దీప, పట్ల కవిత,బొల్లెపాక అనూష
తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments