వంగాలపల్లిలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు
బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
-అనంతరం సభకు తరలివెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:
భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లా చిల్పూర్ మండలం వంగాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి గులాబీ జెండా ఆవిష్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో బహిరంగ సభకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిట్యాల దయాకర్, గ్రామ ఇంచార్జ్ ఆరూరి రవిచందర్ మాట్లాడుతూ,
“తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం చిరస్మరణీయం. కష్టాల్లో కడబడిన తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చిన పార్టీ మన బీఆర్ఎస్. గత 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త విశేషంగా కృషి చేశాడు. గ్రామస్థులు చూపిస్తున్న మద్దతు వల్ల బీఆర్ఎస్ మరింత బలంగా ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఆవేశాలు మరింత విస్తరించి ప్రజల సంక్షేమానికి పాటుపడుతుంది,” అని వారు పేర్కొన్నారు.
Comments