పల్లె పల్లెనా గులాబీ జెండాలే..
ప్రతిదారి గులాబీ మయమైన వరంగల్ పయనమే.
. ఘనంగా 25 వ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
25 వసంతాల టిఆర్ఎస్ పార్టీ రజోత్సవాన్ని చరిత్ర చెప్పుకునేలా విజయవంతం చేయబోతున్న తెలంగాణ ప్రజానీకం.
జెండా ఎగురవేసి వరంగల్ సభకు బయలుదేరిన మండలంలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
మెదక్ బ్యూరో/ టేక్మాల్ తెలంగాణ ముచ్చట్లు:
మండల కేంద్రంలో ఆదివారం బిఅర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్బంగా టేక్మాల్ బస్టాండ్ ఆవరణంలో పార్టీ జెండాను బిఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప బిఅర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు.
మండల ప్రజలందరికీ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు, కార్యకర్తలకు నాయకులకు అందరికీ బిఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట సాధన కోసం ఎంతో మంది అమరులు అయ్యారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారధి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరింది అన్నారు. రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమైంది, 10 ఏళ్లలో బిఆర్ఎస్ ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ నిలిచిపోయిందన్నారు.రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టారన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీనీ కబంధ అస్తల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండగడుతూ బిఅర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకులు, కమ్మరి సిద్ధయ్య, నాయికోటీ భాస్కర్, చింతా రవి, బోరంఛ సాయిలు, యంఏ సలీం, సురేందర్ రెడ్డి, హన్మగౌడ్, మతిన్, మాణిక్యం, సత్యం, సుధాకర్, బాలకృష్ణ, కిషన్ ,దుర్గయ్య, ప్రభాకర్, సంతోష్, చంద్రశేఖర్, రాములు, సాయిలు, అల్లావుద్దీన్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments