మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ రికార్డు సాధించిన బొల్లెపాక నిహాల్

అత్యధిక ఎయిర్ పంచెస్ (45,808) కొట్టిన నిహాల్

మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ రికార్డు సాధించిన బొల్లెపాక నిహాల్

-హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు 

తెలంగాణ ముచ్చట్లు హైదరాబాద్: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన నిహాల్ బొల్లేపాక తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక ఎయిర్ పంచెస్ (45,808) కొట్టి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

ఈ ఘనతను సాధించడంలో అమీకల్ స్పోర్ట్స్ అకాడమీ మరియు విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రోత్సాహం మరుపరానిది. మొత్తం 409 మంది పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో నిహాల్ తన అసాధారణమైన శ్రమ, పట్టుదలతో అందరినీ ఆకట్టుకున్నాడు.

నిహాల్ ‘ఛాంపియన్స్ షోటోకాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ’ (CSMA)లో శిక్షణ పొందుతున్నాడు. ఈ అకాడమీ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ బి. రవికుమార్ గౌడ్ నిహాల్‌కు మార్గదర్శకుడిగా నిలిచారు. చిన్న వయసులోనే అంతటి ఘనతను సాధించిన నిహాల్ తాటికాయల గ్రామానికి గర్వకారణంగా మారాడు.

సర్టిఫికెట్, మెడల్, ట్రోఫీతో మెరిసిపోతున్న నిహాల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అతడి విజయాన్ని కుటుంబ సభ్యులు, గురువులు, గ్రామస్తులు అభినందిస్తూ గర్వపడుతున్నారు. భవిష్యత్తులోనూ నిహాల్ మరింత ఉన్నత స్థాయిలో దేశానికి పేరు తెచ్చేలా మారాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.నిహాల్  ప్రస్తుతం IMG-20250427-WA0075IMG-20250427-WA0074హైదరాబాద్ నగారంలోని సెయింట్ మేరీస్ బెథానీ కాన్వెంట్ విద్యాలయలో 6వ తరగతి చదువుతున్నాడు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......